Lumina
Psalms

Contend, O LORD

Psalms 35·Telugu Bible

1యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము.

2కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.

3ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.

4నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక.

5యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.

Psalms 35 illustration - Psalms Chapter 35

6యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక.

7నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

8వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.

9అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.

10అప్పుడుయెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.

Psalms 35 illustration - Psalms Chapter 35

11కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.

12మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

13వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.

14అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.

15నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.

Psalms 35 illustration - Psalms Chapter 35

16విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.

17ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము

18అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

19నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నియ్యకుము.

20వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు.

Psalms 35 illustration - Psalms Chapter 35

21నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.

22యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.

23నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము.

24యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.

25ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక

Psalms 35 illustration - Psalms Chapter 35

26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక

27నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.

28నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

Chapter Complete

You have read Psalms 35

28 verses