Lumina
Psalms

Taste and See

Psalms 34·Telugu Bible

1నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.

2యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.

3నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.

4నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.

5వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.

Psalms 34 illustration - Psalms Chapter 34

6ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.

7యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును

8యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

9యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.

10సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

Psalms 34 illustration - Psalms Chapter 34

11పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా?

13చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.

14కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

15యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.

Psalms 34 illustration - Psalms Chapter 34

16దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.

17నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.

18విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

19నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును.

20ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.

Psalms 34 illustration - Psalms Chapter 34

21చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు

22యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు.

Chapter Complete

You have read Psalms 34

22 verses