Lumina
Psalms

My God, Why Hast Thou Forsaken Me?

Psalms 22·Telugu Bible

1నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?

2నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

3నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.

4మా పితరులు నీయందు నమి్మక యుంచిరి వారు నీయందు నమి్మక యుంచగా నీవు వారిని రక్షించితివి.

5వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమి్మక యుంచి సిగ్గుపడకపోయిరి.

Psalms 22 illustration - Psalms Chapter 22

6నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

7నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు.

8యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.

9గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా నాకు నమి్మక పుట్టించితివి.

10గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవునీవే.

Psalms 22 illustration - Psalms Chapter 22

11శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడునాకు దూరముగా నుండకుము.

12వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

13చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

14నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలెకరగియున్నది.

15నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.

Psalms 22 illustration - Psalms Chapter 22

16కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

17నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు

18నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

19యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.

20ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.

Psalms 22 illustration - Psalms Chapter 22

21సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించినాకుత్తరమిచ్చి యున్నావు

22నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.

23యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడియాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడిఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకుభయపడుడి

24ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు.వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

25మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దనుఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.

Psalms 22 illustration - Psalms Chapter 22

26దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరుమీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.

27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు

28రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే.

29భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగువారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు

30ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.

Psalms 22 illustration - Psalms Chapter 22

31వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

Chapter Complete

You have read Psalms 22

31 verses