Lumina
Psalms

Joy in Salvation

Psalms 21·Telugu Bible

1యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడునీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.

2అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు.

3శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు.

4ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావుసదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు.

5నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు.

Psalms 21 illustration - Psalms Chapter 21

6నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావునీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు.

7ఏలయనగా రాజు యెహోవాయందు నమి్మక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.

8నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.

9నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును.

10భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవునరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు.

Psalms 21 illustration - Psalms Chapter 21

11వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురు పాయము పన్నిరికాని దానిని కొనసాగింప లేకపోయిరి.

12నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీదకొట్టుదువు.

13యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించు కొనుముమేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.

Chapter Complete

You have read Psalms 21

13 verses