Lumina
Psalms

A Weaned Child

Psalms 131·Telugu Bible

1యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు.

2నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.

3ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.

Chapter Complete

You have read Psalms 131

3 verses