Lumina
Psalms

How Long, O LORD?

Psalms 13·Telugu Bible

1యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు?

2ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

3యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

4నేను మరణనిద్ర నొందకుండనువాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండనునా కన్నులకు వెలుగిమ్ము.

5నేనైతే నీ కృపయందు నమి్మక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నదియెహోవా

Psalms 13 illustration - Psalms Chapter 13

6నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.

Chapter Complete

You have read Psalms 13

6 verses