Lumina
Psalms

I Love the LORD

Psalms 116·Telugu Bible

1యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.

2ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును

3మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

4అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.

5యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.

Psalms 116 illustration - Psalms Chapter 116

6యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.

7నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.

8మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

9సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.

10నేను ఆలాగు మాటలాడి నమి్మక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.

Psalms 116 illustration - Psalms Chapter 116

11నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.

12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

13రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

14యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను

15యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది

Psalms 116 illustration - Psalms Chapter 116

16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.

17నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను

18ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను

19యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.

Chapter Complete

You have read Psalms 116

19 verses