Lumina
Psalms

Praise for His Works

Psalms 111·Telugu Bible

1యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.

2యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించు దురు.

3ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

4ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు

5తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.

Psalms 111 illustration - Psalms Chapter 111

6ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి యున్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి యున్నాడు.

7ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.

8అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.

9ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

10యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

Chapter Complete

You have read Psalms 111

10 verses