Lumina
Psalms

Remember His Wonders

Psalms 105·Telugu Bible

1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి.

2ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి

3ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక.

4యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి

5ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసి కొనుడి

Psalms 105 illustration - Psalms Chapter 105

6ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు లను జ్ఞాపకముచేసికొనుడి

7ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

8తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధనను

9ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.

10వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను

Psalms 105 illustration - Psalms Chapter 105

11కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను

12ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి యున్నాడు.

13వారు జనమునుండి జనమునకును ఒక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు తిరుగు లాడు చుండగా

14నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి

15ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.

Psalms 105 illustration - Psalms Chapter 105

16దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.

17వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను.

18వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.

19అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.

20రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను.

Psalms 105 illustration - Psalms Chapter 105

21ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును

22తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను.

23ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.

24ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను.

25తన ప్రజలను పగజేయునట్లును తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను.

Psalms 105 illustration - Psalms Chapter 105

26ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.

27వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి

28ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.

29ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.

30వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.

Psalms 105 illustration - Psalms Chapter 105

31ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.

32ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను.

33వారి ద్రాక్షతీగెలను వారి అంజూరపు చెట్లను పడ గొట్టెను వారి ప్రాంతములయందలి వృక్షములను విరుగకొట్టెను.

34ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను,

35అవి వారిదేశపు కూరచెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను.

Psalms 105 illustration - Psalms Chapter 105

36వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను.

37అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.

38వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి

39వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.

40వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.

Psalms 105 illustration - Psalms Chapter 105

41బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.

42ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని

43ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలు పలికి రప్పించెను.

44వారు తన కట్టడలను గైకొనునట్లును

45తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి.యెహోవాను స్తుతించుడి.

Chapter Complete

You have read Psalms 105

45 verses