Lumina
Psalms

Bless the LORD for Creation

Psalms 104·Telugu Bible

1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.

2వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు.

3జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు

4వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు.

5భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.

Psalms 104 illustration - Psalms Chapter 104

6దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.

7నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.

8నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.

9అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.

10ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.

Psalms 104 illustration - Psalms Chapter 104

11అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.

12వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.

13తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.

14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు

15అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు

Psalms 104 illustration - Psalms Chapter 104

16యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి.

17అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.

18గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు

19ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును

20నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.

Psalms 104 illustration - Psalms Chapter 104

21సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి.

22సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.

23సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.

24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.

25అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.

Psalms 104 illustration - Psalms Chapter 104

26అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి.

27తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి

28నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును.

29నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.

30నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.

Psalms 104 illustration - Psalms Chapter 104

31యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక.

32ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును

33నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.

34ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.

35పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.

Chapter Complete

You have read Psalms 104

35 verses