Lumina
Nehemiah

Lists of Returned Exiles

Nehemiah 7·Telugu Bible

1నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట

2నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.

3అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.

4అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.

5జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

6జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి

7తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.

8అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును

9​షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును

10ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

11యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు

12ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.

13జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును

14జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు

15​బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

16​​బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును

17అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును

18అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును

19బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును

20​అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

21హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును

22హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును

23​జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును

24హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును

25గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

26​బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును

27అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు

28బేతజ్మావెతువారు నలువది యిద్దరును

29కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును

30రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

31మిక్మషువారు నూట ఇరువది యిద్దరును

32బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును

33రెండవ నెబోవారు ఏబది యిద్దరును

34రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును

35హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

36​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

37​లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

38​సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు

39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును

40​ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

41​పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

42హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును

43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును

44​గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును

45ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

46నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు

47కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు

48లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు

49​హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు

50రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

51గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు

52బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.

53బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు

54బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు

55బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

56సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు

57సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు

58యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు

59​షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.

60​ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

61తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.

62వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు

63హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.

64వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.

65కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

66సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.

67వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.

68వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును

69వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.

70పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

71​మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.

72​మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.

73​అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.

Chapter Complete

You have read Nehemiah 7

73 verses