Lumina
Judges

Gideon Pursues; Death of Gideon

Judges 8·Telugu Bible

1అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.

2అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.

3అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.

4​గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.

5​అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా

Judges 8 illustration - Judges Chapter 8

6సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలె నని యడిగిరి.

7​అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహము లను నూర్చి వేయుదునని చెప్పెను.

8అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు

9నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను.

10అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.

Judges 8 illustration - Judges Chapter 8

11అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.

12జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.

13యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను

14​హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸°వనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.

15అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహా రము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి

Judges 8 illustration - Judges Chapter 8

16ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.

17మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.

18అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారు లను పోలియుండిరనగా

19అతడువారు నా తల్లి కుమా రులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చిన యెడల

20యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందు నని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచినీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.

Judges 8 illustration - Judges Chapter 8

21అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.

22అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతోనీవు మిద్యా నీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.

23అందుకు గిద్యోనునేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.

24​మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.

25​అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.

Judges 8 illustration - Judges Chapter 8

26మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.

27కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.

28మిద్యానీ యులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరు వాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినము లలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

29తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.

30గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.

Judges 8 illustration - Judges Chapter 8

31​షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.

32​యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.

33గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక

34మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.

35మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

Chapter Complete

You have read Judges 8

35 verses