Lumina
Job

Bildad's First Speech

Job 8·Telugu Bible

1అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను

2ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.

3దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

4నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.

5నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల

Job 8 illustration - Job Chapter 8

6నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.

7అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.

8మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.

9మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.

10వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.

Job 8 illustration - Job Chapter 8

11బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

12అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.

13దేవుని మరచువారందరి గతి అట్లే ఉండునుభక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

14అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.

15అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.

Job 8 illustration - Job Chapter 8

16అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును.ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.

17అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనునురాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.

18దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.

19ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.

20ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు.ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.

Job 8 illustration - Job Chapter 8

21నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురుదుష్టుల గుడారము ఇక నిలువకపోవును.

22అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును.ప్రహర్షముతో నీ పెదవులను నింపును.

Chapter Complete

You have read Job 8

22 verses