Lumina
Job

Elihu Defends God

Job 34·Telugu Bible

1అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను

2జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

3అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.

4న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.

5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

Job 34 illustration - Job Chapter 34

6న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానునేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.

7యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.

8అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.

9నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.

10విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

Job 34 illustration - Job Chapter 34

11నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును.

12దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

13ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?

14ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల

15శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.

Job 34 illustration - Job Chapter 34

16కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.

17న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా?

18నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?

19రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?

20వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.

Job 34 illustration - Job Chapter 34

21ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.

22దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.

23ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి అగత్యము లేదు.

24విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.

25వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.

Job 34 illustration - Job Chapter 34

26దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.

27ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.

28బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.

29ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడలఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే

30భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

Job 34 illustration - Job Chapter 34

31ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను

32నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?

33నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.

34వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు

35యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి

Job 34 illustration - Job Chapter 34

36దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరు చున్నాను.

37అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.

Chapter Complete

You have read Job 34

37 verses