Lumina
Job

Job's Lament

Job 3·Telugu Bible

1ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.

2యోబు ఈలాగు అనెను

3నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాకమగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

4ఆ దినము అంధకారమగును గాకపైనుండి దేవుడు దాని నెంచకుండును గాకవెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

5చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక.మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక

Job 3 illustration - Job Chapter 3

6అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాకసంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాకమాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.

7ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాకదానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక

8దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించు దురు గాక.

9అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక

10అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?

Job 3 illustration - Job Chapter 3

11గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?

12మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని?

13లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందునునేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును

14తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.

15బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును.

Job 3 illustration - Job Chapter 3

16అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును.వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.

17అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు

18బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు

19అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారుదాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.

20దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

Job 3 illustration - Job Chapter 3

21వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.

22సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

24భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

25ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

Job 3 illustration - Job Chapter 3

26నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.

Chapter Complete

You have read Job 3

26 verses