Lumina
Job

The Wicked

Job 24·Telugu Bible

1సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు... ఏర్పాటుచేయడు?ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?

2సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.

3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

4వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించివేయుదురుదేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.

5అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లుబీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురుఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

Job 24 illustration - Job Chapter 24

6పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురుదుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.

7బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురుచలిలో వస్త్రహీనులై పడియుందురు.

8పర్వతములమీది జల్లులకు తడిసియుందురుచాటులేనందున బండను కౌగలించుకొందురు.

9తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

10దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురుఆకలిగొని పనలను మోయుదురు.

Job 24 illustration - Job Chapter 24

11వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.

12జనముగల పట్టణములో మూలుగుదురుగాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.

13వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.

14తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును.

15వ్యభిచారిఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.

Job 24 illustration - Job Chapter 24

16చీకటిలో వారు కన్నము వేయుదురుపగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు

17వారందరు ఉదయమును మరణాంధకారముగాఎంచుదురు.గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.

18జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురువారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తముద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.

19అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లుపాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.

20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు

Job 24 illustration - Job Chapter 24

21వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురువిధవరాండ్రకు మేలుచేయరు.

22ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.

23ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురుఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును

24వారు హెచ్చింపబడిననుకొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.

25ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

Chapter Complete

You have read Job 24

25 verses