Lumina
Job

Zophar's Second Speech

Job 20·Telugu Bible

1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

3నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నం దుకునా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

4దుష్టులకు విజయము కొద్దికాలముండునుభక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.

5ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలముమొదలుకొనిఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

Job 20 illustration - Job Chapter 20

6వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగిననుమేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

7తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారువారేమైరని యడుగుదురు.

8కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురురాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

9వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

10వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.

Job 20 illustration - Job Chapter 20

11వారి యెముకలలో ¸°వనబలము నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.

12చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.

13దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.

14అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.

15వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.

Job 20 illustration - Job Chapter 20

16వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్లపాముల విషమును పీల్చుదురునాగుపాము నాలుక వారిని చంపును.

17ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

18దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరోదానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు

19వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.

20వారు ఎడతెగక ఆశించినవారుతమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనజాలరు.

Job 20 illustration - Job Chapter 20

21వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు.

22వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురుదురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును.

23వారు కడుపు నింపుకొననైయుండగాదేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును.

24ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగాఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.

25అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.

Job 20 illustration - Job Chapter 20

26వారి ధననిధులు అంధకారపూర్ణములగునుఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయునువారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును.

27ఆకాశము వారి దోషమును బయలుపరచునుభూమి వారిమీదికి లేచును.

28వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవునుదేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.

29ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగముదేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.

Chapter Complete

You have read Job 20

29 verses