Lumina
Isaiah

The Mountain of the LORD

Isaiah 2·Telugu Bible

1యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

5యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

Isaiah 2 illustration - Isaiah Chapter 2

6యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథ ములకు మితిలేదు.

8వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

9అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

10యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.

Isaiah 2 illustration - Isaiah Chapter 2

11నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

Isaiah 2 illustration - Isaiah Chapter 2

16తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

19యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

Isaiah 2 illustration - Isaiah Chapter 2

21దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

22తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

Chapter Complete

You have read Isaiah 2

22 verses